ఏ పాత్ర ఇచ్చినా దానికి వందశాతం న్యాయం చేయాలని నటి త్రిప్తి డిమ్రి అన్నారు. ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని మరోసారి వెల్లడించారు. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించారు. ‘మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే చాలా ధైర్యం కావాలి. ఏ పాత్ర చేస్తున్నా అందులో మనం కనిపించకూడదు. మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర పేరుతో మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ప్రశంస మరొకటి ఉండదు’ అని చెప్పింది యానిమల్ భామ.
