జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటించిన ‘శివ శక్తి’ పేరును అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. గతేడాది ఆగస్టు 23న ప్రధాని ఆ పేరును ప్రకటించగా దాదాపు 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. ప్రకృతి పురుషుడు (శివుడు), స్త్రీ (శక్తి) అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుంచి సేకరించిన పదమే ‘శివ శక్తి’ అని గెజిటరీ ఆఫ్ ప్లానెటరీ నోమెన్‌క్లేచర్ వివరించింది.