బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే నీళ్లు వృథా చేసిన 22 కుటుంబాలకు రూ.5వేలు చొప్పున అధికారులు రూ.1,10,000 ఫైన్ వేశారు. ఆయా కుటుంబాలు కావేరి నీటిని కార్లను శుభ్రపరచడం, తోటపని చేయడం వంటి అనవసరమైన వాటికి తాగునీటిని ఉపయోగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులతో చర్యలు తీసుకున్నట్టు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్‌బీ) తెలిపింది.