UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 మన ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ జ్యూస్

మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒకటి. ఎర్రగా, నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చర్మం మీద రాస్తే అది సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్రదేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమ స్థానంలో ఉంది. రక్తపోటుతో బాధపడుతున్నా లేదా ట్రై గ్లిజరాయిడ్స్ వంద దాటి ఉన్నా అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడే హెచ్ డి ఎల్ 50 కంటే తక్కువగా ఉన్నా ప్రతివారం ఒకసారి ఒక గ్లాస్ దానిమ్మ రసాన్ని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులు ఉన్న వారికి దానిమ్మ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలను కూడా దానిమ్మ జ్యూస్ మటుమాయం చేస్తుందని వారు చెబుతున్నారు. దానిమ్మ రసం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దానిమ్మ గింజలను తినడం కన్నా వాటిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. దానిమ్మ జ్యూస్ ను తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, కుష్టు వ్యాధి నయం అవుతుందని కొన్ని పరిశోధనల్లో తేలిందట. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇది కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగించి వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ ను, రొమ్ము క్యాన్సర్ ను, చర్మ క్యాన్స ర్ ను అడ్డుకుంటాయి.

దానిమ్మ తొక్క, బెరడు, గింజలను విరోచనాలకు ఔషధంగా వాడతారు. దానిమ్మ పూలు, బెరడును బట్టలకు రంగులు అద్దే పరిశ్రమలో వాడతారు. దానిమ్మ పండ్ల నుండి ద్రాక్ష వైన్ కంటే మేలైన వైన్ ను తయారు చేయవచ్చట. దానిమ్మ ఆకులతో చేసిన కషాయంలో పంచదారను కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బసం, అజీర్తి, దగ్గు, వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ ఆకులను వేడి చేసి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు రోజుకు 400మిల్లీ గ్రాముల నుండి 600 మిల్లీ గ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. దానిమ్మ రసం ఒకసారి తాగడం వల్ల 60 మిల్లీ గ్రాముల ఫోలిక్ యాసిడ్ లభ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు.

దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వల్ల నిద్రలేమి, అలసటను దూరం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. స్త్రీలల్లో నెలసరి సమయంలో ఉండే ఒత్తిళ్లను, ఇబ్బందులను కూడా దానిమ్మ జ్యూస్ తొలగిస్తుందట. దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల పురుషుల్లో వచ్చే అంగస్థంభనతో పాటు లైంగిక సమస్యలు కూడా దూరం అవుతాయి. దానిమ్మలో ఉండే రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల కలిగే హానిని కలిగిస్తాయట. రక్తపోటును నియంత్రించే గుణం కూడా దానిమ్మ జ్యూస్ కు ఉందట. రక్తనాళాలు పూడుకుపోకుండా దానిమ్మ జ్యూస్ కాపాడుతుందట. దీనిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్స ర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయట. ఈ విధంగా దానిమ్మ జ్యూస్ మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !