రంజాన్ మాసం సందర్భంగా కేరళ స్టోరీ నటి ఆదాశర్మ ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. కాగా ఓ నెటిజన్ ఆదాశర్మను విమర్శిస్తూ నార్మల్ రోజులలో ముస్లింలను విలన్లుగా చూపిస్తూ సినిమాలు చేస్తుంది. ఈవెన్ డేస్‌లో ముస్లింలు గొప్పవారు.. ఎందుకంటే నిన్ను బిర్యానీ కోసం ఇన్‌వైట్ చేసారంటూ పోస్టు పెట్టాడు. దీనికి కౌంటర్‌గా ఆదాశర్మ డియర్ సర్ ఏరోజైనా సరే ఉగ్రవాదులు అనే వాళ్లు విలన్లు.. ముస్లింలు కాదంటూ రిప్లై ఇచ్చింది.