ప్రియుడు మథియస్ తో పెళ్లి ప్రచారం నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ ఆసక్తికర పోస్ట్ చేశారు. చీరపై కోటు ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ఈ చీరతో రొమాన్స్ ఎప్పటికీ ముగియదని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. దీంతో నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్ తో బంధం గురించి మాట్లాడుతున్నావా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.