UPDATES  

 చీడెం హరీష్ అరెస్ట్..

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

గత కొన్ని రోజుల కిందట వెంకటాపురం మండలం ఆలూబాక గ్రామానికి చెందిన సాహితి మరణానికి కారకుడైన చీడెంమోహన్ రావు తనయుడు చీడెం హరీష్ ని దిల్షుక్నగర్ చైతన్యపురి కమిషనరేట్ లో సీఐ వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు. పూర్వ పారాలు అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ కు తరలించినట్టుగా వెంకటేశ్వర్లు తెలిపారు. హరీష్ అరెస్టుతో వెంకటాపురం మండలం వాజేడు మండలంలో సర్వత్ర చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు పై మండల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, రాజకీయ నాయకుల బెదిరింపులకు లొంగకుండా వాళ్లకు కొమ్ముగాయకుండా, అహర్నిశలు సాహితి కేసు ను ముందుకు తీసుకెళ్లి ఎట్టకేలకు అరెస్టు చేయడం హర్ష స్పదమని సాహితీ తల్లిదండ్రులు. మరియు మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరెస్టు విషయం పట్ల సంతోషించేలోపే దుఃఖం పలకరించినట్టుగా ఇంకొక వైపు చీడెం హరీష్ తండ్రి మోహన్ రావు మండలంలో తన కుమారుడి విషయం జటిలం అవ్వకుండా జాగ్రత్త తీసుకోవడంలో భాగంగా , చీడెం హరీష్ అరెస్టు అయిన విషయం కూడా పైకి పొక్కకుండా దాని రూపు మార్చేందుకు ప్రజలను మభ్యపెట్టే పథకానికి హరీష్ తండ్రి రూపకల్పన చేసినట్టుగా సాహితి తల్లి ఆరోపించారు. మండలంలో అందరికీ మా కుటుంబానికి ఆయన కుటుంబానికి సంబంధం ఉన్నట్టు మేము కలిసిపోయాము మీకెందుకు అని వచ్చి ప్రశ్నించిన విలేకరులకు సైతం కట్టు కథలకు చెప్పుటలోశ్రీకారం చుట్టాడుఅని సాహితీ తల్లి తెలిపారు. ఈ విషయంలో విలేకరులు ఎవరు పట్టించుకోవద్దు అని ఊర్లో ఎక్కడ చూసినా ఇదే ప్రచారం నడిపిస్తున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి తన రాజకీయ బలగంతో కొంతమంది రాజకీయ నాయకులతో వారికి ఫోన్ చేపించి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఈ కేసును వదిలేయండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చరవాణిలో బెదిరించినట్టుగా ఆమె ఆరోపించారు. ఆయనని మీరు ఏమి చేయలేరు, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నట్టుగాఆమె మన్యంన్యూస్ విలేఖరికి వారి గోడు ను విలపించారు. ఎవరు కూడా సాహితీ మరణం పై చివరి క్షణం వరకు ఏ పత్రిక విలేకరులు రాలేదని ఆమె బాధను వ్యక్తం చేశారు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అని అయినా కూడా మేము మేము కాంప్రమైజ్ అయ్యాము అని ఊర్లో దుష్ప్రచారానికి పాల్పడి ఇంకా మా కుటుంబాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె అన్నారు. సాహితీ మరణం కంటే ఎక్కువ ఈ అనుగదొక్కే సామూహిక దాడి మాకు ఇంకా నరకాన్ని చూపిస్తున్న పరిస్థితి దయనీయమని ఆమె కన్నీరు మున్నీరయ్యారు, ఇటువంటి ప్రచారం చేసి మమ్మల్ని చంపుతున్నారని ఈ నేపథ్యంలో ఇంకా ఈ ప్రచారం కొనసాగితే వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు పెడతామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.రాజకీయ నాయకుల ఫోన్ కాల్స్ బెదిరింపులు మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నాయని, మన్యం న్యూస్ ఒక్క ఛానల్ ఉన్న ధైర్యంతోనే మేము ముందుకు పోతున్నాము అని ఏ ఛానల్ మాకు సపోర్ట్ చేసిన చెయ్యకపోయినా మన్యం న్యూస్ మాకు తోడుగా ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారన్నారు. మా కూతురు చనిపోయి ఇన్ని కష్టాల్లో ఉంటే ఏ ఒక్క పేపర్ కూడా స్పందించని నేపథ్యంలో మన్యం న్యూస్ మాకు అండగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమే కాకుండా హైదరాబాద్ వరకు మా వెన్నంటే ఉండి మాకు ఎంతో తోడ్పాటును కలిగించింది అని సాహితీ కుటుంబ సభ్యులు మన్యం న్యూస్ ఎండి కీ ధన్యవాదాలు తెలిపారు. చీడెం హరీష్ అరెస్టు అయ్యేంతవరకు మా కుటుంబానికి తోడుగా ఉన్న మన్యం న్యూస్ పత్రిక విలేఖరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ మన్యం

పేపర్ ద్వారా ఇంకాచీడెం హరీష్ పై ఆయన చేసిన ఈ ఘాతుకానికి జైల్లో నుంచి బయటకు రాకుండా చట్టపరమైన కేసులు ఇంకా పెట్టాలని, దానికి తగ్గ ఎవిడెన్స్ను మన్యం న్యూస్ పేపర్ ఆ ఎవిడెన్స్ సేకరణలో వారికి తోడ్పాటు ఉండాలని కోరి ప్రార్థించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !