చంద్రుడిపై ప్రామాణిక సమయాన్ని తయారు చేసేందుకు అమెరికా నడుం బిగించింది. ఇప్పటికే దీనిపై పనిచేయాలని వైట్ హౌస్ నుంచి నాసాకు ఆదేశాల జారీ అయ్యాయి. వైట్ హౌస్ ఆదేశాల మేరకు నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి 2026 నాటికి ‘కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్’ కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలి. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.