UPDATES  

 బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపుతోనే తెలంగాణకు మేలు -నామా నాగేశ్వరరావు..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపుతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. గురువారం నాడు అశ్వారావుపేట మండలoలో బీఆరఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొని ఆయన మాట్లాడుతూ లోక్ సభ సమావేశాల్లో తెలంగారాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్ నుండి గెలిచిన ఎంపీలు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదని అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు తో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెప్పిన మాయ మాటలు, మోసపు మాటలు ప్రజలు నమ్మి ఏదో చేస్తారు అని కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లు వేశారు గెలిచిన తరువాత ప్రజలను ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. గత వారం రోజులు గా నేను ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్న చాలా ప్రాంతాల్లో వరి, మొక్క జొన్న పంటలు సాగునీరు అందక ఎండిపోయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు అంతే కాకుండా కనీసం తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. సుమారుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే రైతులు సహా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండేది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు భారత దేశంలోనే మరే రాష్ట్రం లో లేవన్నారు. బీఆరఎస్ ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు అందాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా నేను కేంద్రాన్ని దేశంలో ఇంటింటికీ మంచినీరు ఇచ్చే రాష్ట్రం ఏది అని అడిగిన ప్రశ్నకు వారి తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇంటింటికి మంచి నీరు సరపరా చేస్తుందని తెలిపారని అది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అత్యధికంగా వరి ధాన్యం పండించిన రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయ రంగం లో పంట వేసిన దగ్గర నుండి పంట వచ్చే వరుకు ఏం కావాలో ఇచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. అలానే బడుగు, బలహీన వర్గాల గురించి కూడా ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. కేసీఆర్ పాలన పదేళ్ల లో మనం చేసిన అభివృద్ధి పనులు, ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి పార్టీ నాయకులు వెళ్లి వివరించాలని, అలానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత వారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన విధానం ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీ.ఆర్.యస్ పార్టీని ఓడించి తప్పు చేశామనే భావన ప్రజల్లో వినిపిస్తుందని, ప్రజలు ఇచ్చిన అవకాశం తో జిల్లాకు హైవే రోడ్లు కావాలని, రైల్వే లైన్లు కావాలని కేంద్రం పై పొరాడి తీసుకురావడం జరిగిందని, అలానే భద్రాచలం నుండి కొవ్వూరు వరుకు రైల్వే లైన్ కోసం 120కి పైగా లేఖలు రాయడం తో పాటుగా కేంద్ర మంత్రులను కలసి మంజూరు చేపించడం జరిగిందని గుర్తు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు గత లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చారని మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు లక్షల ఓట్ల మెజారిటీతో నామా నాగేశ్వర రావు అని గెలిపించుకొని కేసీఆర్ కి కానుకగా అందించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశరావు, జడ్పిటిసి ములకలపల్లి సున్నం నాగమణి, దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ, వగ్గేల పూజ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వెంకన్న బాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ, సీనియర్ నాయకులు రమణారావు, కాసాని చంద్రమోహన్, మాజీ సర్పంచ్ రాజశేఖర్, జ్యోష్టన, మాజీ జడ్పిటిసి అంకిత మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ మారుతి లలిత, మాజీ ఎంపీటీసీ వగ్గేల అనుసూర్య, చిప్పనపల్లి శ్రీను, జుజ్జారపు శ్రీరామమూర్తి, మోహన్, ఆరేపల్లి గోవింద్, రమేష్, శివ, వెంకట్ సహ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !