మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 09: ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అశ్వరావుపేట ఐక్యత ప్రెస్ క్లబ్ యొక్క తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను అశ్వరావుపేట శాసనసభ్యులు జారే అది నారాయణ వారి స్వగృహంలో ఐక్యత ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ఆవిష్కరించడం శుభ పరిణామం అని, ప్రజలకు ప్రభుత్వానికి వారిదిలుగా పనిచేసే పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ యొక్క రచన శైలితో ప్రజా సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు జుజ్జారపు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కూన చెన్నారావు ,గౌరవ అధ్యక్షుడు గాలి రాఘవేంద్ర, కోశాధికారి నార్లపాటి సోమేశ్వరరావు, ఉపాధ్యక్షులు దాది చంటి, సహాయ కార్యదర్శి నార్లపాటి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు సిహెచ్ నాగు, గోళ్ళ నవీన్, కుర్సం రవి, శివ శంకర్, కూన దుర్గారావు , బ్రహ్మ రావు తదితరులు పాల్గొన్నారు.
