మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 06: ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కాంక్షిస్తూ అశ్వరావుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు వగ్గెల పూజ సోమవారం మండలంలో పేరాయి గూడెం, అల్లి గూడెం గ్రామాలలో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగా ప్యాకెట్లు పంపిణీ చేస్తూ బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారితో పాటు పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదంటూ ధ్వజమెత్తారు, రుణ మాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఏమైంది మీరిచ్చిన హామీ ఎందుకు చేయలేదో చెప్పాలనీ వైస్ ఎంపీపీ ఫణీంద్ర అన్నారు. అదే విదంగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా రైతులు బ్యాంక్ లో రూ. రెండు లక్షలు రుణం తీసుకుని ఉంటే రైతుల పరిస్థితి ఏమయ్యేదనీ మోటూరి మోహన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే తప్ప ప్రజలు సంక్షేమ ఫలాలను పంచాలనే ఉద్దేశం లేదనీ చిప్పనపల్లి బజారయ్య అన్నారు. వారు ఇచ్చిన ప్రతి వాగ్ధానం ను పట్టుబట్టి అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని శ్రీరామూర్తి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వర రావు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, చిప్పనపవల్లి బజారయ్య, శ్రీరామ్ మూర్తి, మోటూరి మోహన్, చిప్పనపల్లి శ్రీను, తగరం హరి రాంబాబు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
