తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్-25 (ఎన్‌ఎస్-25) వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తిచేశారు. తాజా యాత్రలో గోపీచంద్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణించారు.