UPDATES  

 అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్…

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.

 

అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులు అందరూ శ్రీలంకకు చెందిన వారని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. అయితే వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారనే అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

శ్రీలంక నుంచి చెన్నైకి నలుగురు టెర్రరిస్టులు అహ్మదాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదింపులు పెరిగిన సందర్భంలో ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడగా ఈ అంశం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 6 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !