నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం పనిచేస్తున్న అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, డాక్టర్ షేక్ రోషన్ మొహిద్దీన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నీట్ యూజీ పరీక్షలో 718, 719 మార్కులు చాలా ఎక్కువని.. వాటిని సాధించడం అసాధ్యమని వారు పేర్కొన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపులోనూ తేడాలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారు.