UPDATES  

 ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో భూములపై పూర్తి హక్కులు ఆదివాసీలవే..

  • ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో భూములపై పూర్తి హక్కులు ఆదివాసీలవే
  • కలెక్టర్ సార్ కొమరం భీమ్ కాలనీ ఆదివాసీలకు న్యాయం చేయండి
  • వాడగూడెం (జి)లో 10 ఎకరాల భూమికి హక్కుదారులు ఆదివాసీలే
  • ఎనిమిదవ రోజు ఆదివాసి 30 కుటుంబాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం
  • షెడ్యూల్ ప్రాంతంలో 1/70 , ఎల్ టి ఆర్ చట్టాలను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నట్లు గా వ్యవహార శైలి

మన్యం న్యూస్ వెంకటాపురం.

గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొమరం భీమ్ కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల క్రితం వాడగూడెం (జి) సర్వేనెంబర్ 27 భూమిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొమరం భీం కాలనీ ఆదివాసీలపై 5 సంవత్సరాలుగా గిరిజనేతరులు దేవస్థానం భూమి పేరుట అన్యం పుణ్యం ఎరగని ఆదివాసీలపై పలు కారణాలు చూపిస్తూ భూమి నుండి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,కొమరం భీం కాలనీ ఆదివాసి ప్రజలకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.
ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం లో గిరిజనేతరులకు, భూమిపైన హక్కు లేదని,1/70, ఎల్ టి ఆర్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయని, ప్రభుత్వ భూములు దేవస్థానాల పేరుట,ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుట భూ బదలాయింపు జరగాలన్న, పీసా గ్రామసభ తీర్మానం పెట్టి వన్ బై థర్డ్ మెజార్టీ అభిప్రాయం మేరకు తీర్మానం ఆమోదం పొందిన తర్వాతనే భూమిపై ప్రభుత్వానికైనా హక్కు ఉంటుందని, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి సిద్ధబోయిన సర్వేశ్వరరావు అన్నారు. కొమరం భీం కాలనీ ఆదివాసీలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, కొమరం భీమ్ కాలనీ ఆదివాసీలకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని, ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివాసి ప్రజలు సాగులో ఉన్న ఈ భూమిపై, అన్యాయం ఎరుగని ఆదివాసీలపై 144 సెక్షన్ పెట్టడం తగదని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి మడకం చిట్టిబాబు, జిల్లా కోశాధికారి కుచ్చింటి చిరంజీవి కొమరం భీమ్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !