UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 నరరూప రాక్షసులతో రాజమౌళి మహేశ్ సినిమా

ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి మహేశ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడో చేయడంతో దాని కోసం మహేశ్ ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న తిరిగి రాగానే ముహూర్తం చూసి మొదలు పెట్టే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అయితే అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పటి లాగే ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.

దీంతో స్టోరీ అద్భుతంగా ఉంటుందని బాగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే తాజాగా దీనిపై మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊహించని ఫైట్ ఉంటుందని అందరూ అంటున్నారు. మహేశ్ నరరూప రాక్షసులతో తలపడనున్నాడట.. ఆ వివరాలేంటో మనం చూడొచ్చు రాజమౌళి సినిమాలో ఫైట్స్ మాములుగా ఉండవు అని. బాడీ బిల్డింగ్ ఉన్న హీరోతో పాటు.. అంతే స్థాయిలో విలన్స్ కూడా ఈ సినిమా లో ఉంటారు.

అవసరమైతే హీరోతో ఎక్సరసైజ్ లు చేయించైనా.. భారీ శరీరాన్ని ఏర్పాటు చేయిస్తాడు. ఆ విషయాన్ని నాటి ఛత్రపతి నుంచి నేటి బాహుబలి వరకు తెరపై చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మహేశ్ తో తీయబోయే సినిమాలో కూడా భారీ ఫైట్స్ ఉండే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఆ ఫైట్స్ కూడా లోకల్ గా కాకుండా విదేశాల్లో చిత్రీకరించేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తున్నారట మరీ. ఈ సినిమా మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లో తీసే అవకాశం ఉందని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గం. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని భారీ ఫైట్స్ చిత్రీకరిస్తారట.

ఈ ఫైట్ లో సాధారణ మనుషులు కాకుండా నరరూప రాక్షకులతో మహేశ్ తలపడేలా సెట్ చేస్తున్నారట మరీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారని ప్రచారం బాగానే సాగుతోంది. దీంతో సినిమాలో భాగంగా మహేశ్ అక్కడికి వెళ్లిన సందర్భంగా అక్కడి వారితో ఫైట్ చేసే విధంగా సినిమాను చిత్రీకరిస్తారట. ఇందు కోసం కొందరు ఫారిన్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించనున్నాడట జక్కన్న వివరించారు. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమా అంటే మినిమం వందల కోట్లు ఉంటుంది మరీ. సీన్ అద్భుతంగా రావడానికి ఖర్చు ఎంతైనా కాంప్రమైజ్ కాడు. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఏదో ఒకటి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ ఫైట్స్ ప్రధానంగా కనిపించాయి. ఇప్పుడు కూడా మహేశ్ తో తీయబోయే సినిమాలో ఫైట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడట. ఇందులో భాగంగా నరరూప రాక్షకులతో ఫైట్స్ పెట్టాలని అనుకున్నాట. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా ఎమ్ చేయలేదు. కానీ ఇలాంటిది ఉంటే బాటుంటుంని ఫ్యాన్ష్ చర్చించుకుంటున్నారు మరీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !