UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 సలార్ హక్కుల కోసం గట్టి పోటీ

బాహుబలి సినిమాతో తన స్టార్ డం మరింత పెంచేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.ఇటీవల వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా నిరాశపరచడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ ప్రభాస్ రేంజ్ మరింత పెంచడం ఖాయమని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తుండగా. ఇందులో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.విడుదలకు ముందే సలార్ సినిమాపై ఏర్పడిన అంచనాలతో ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఈ మేరకు సలార్ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడగా, చివరకు సలార్ శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ చేజిక్కించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పటివరకు స్టార్ మా వాళ్ళు భారీ డబ్బుతో హక్కులని చేజిక్కించుకున్న కొన్ని సినిమాల్లో సలార్ టాప్ ప్లేస్ లో ఉందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇది మా హీరో రేంజ్ అంటూ మురిసిపోతున్నారు . దటీజ్ ప్రభాస్..! హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున సలార్ సినిమాను చిత్రీకరిస్తుండగా, ఇందులో జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ , ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు.

భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే కాగా, ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరోకీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించిందట. ఈ మూవీ సలార్‌ని మించి ఉంటుందని కొందరు అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !