UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 భారీ స్థాయిలో రీ రిలీజ్ కి ‘నువ్వే నువ్వే’ చిత్రం.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు పని చేసాడు..కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా మారి తీసిన చిత్రం నువ్వే నువ్వే..తరుణ్ మరియు శ్రియ శరన్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది..డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నిలబెట్టింది.

ఈ సినిమా విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు..ఇప్పటి వరుకు తీసిన సినిమాలలో కేవలం రెండు ఫ్లాప్స్ మినహా మిగిలినవన్నీ సూపర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి..ఈ చిత్రం విడుదలై దాదాపుగా 20 ఏళ్ళు పూర్తి అయ్యింది..అంటే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి రెండు దశాబ్దాలు అయ్యింది అన్నమాట.    ఇది ఇలా ఉండగా నవంబర్ 7 వ తేదీన త్రివిక్రమ్ గారి పుట్టిన రోజు అవ్వడం తో నువ్వే నువ్వే సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరోసారి రీ రిలీజ్ చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్..నవంబర్ నాల్గవ తేదీ నుండి ఈ సినిమా షోస్ ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పలు చోట్ల ప్రారంభించగా..పర్వాలేదు అనే స్థాయి లో టికెట్స్ అమ్ముడుపోయాయి..కొద్దీ రోజుల క్రితమే హైదరాబాద్ లో ఉన్న AMB సినిమాస్ లో ఈ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా మూవీ టీం మొత్తం ఒక ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేసుకున్నారు.        ఈ షో కి హీరో తరుణ్ , హీరోయిన్ శ్రీయా తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ వంటివారు కూడా హాజరయ్యారు..దీనికి సంబంధించిన వీడియోస్ ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది..మరి ఈ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిమరి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !