UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 రష్మిక కి కౌంటర్ ఇచ్చిన సుకుమార్

గత సంవత్సరం డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు.

ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ మాస్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పుష్ప.. పుష్ప రాజ్..తగ్గేదేలే.. అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తగ్గేదేలే డైలాగ్ జనాల నోళ్లలో బాగా నానింది. అలాగే ఈ సినిమాలో అన్ని పాటలకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎక్కడ చూసినా పుష్ప మానియాని కనబడింది. అంతలా హిట్ అయింది పుష్ప సినిమా. అందుకే ప్రస్తుతం పుష్ప 2 సినిమా తీయడానికి సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు.

అలాగే పుష్ప సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న నటించి ప్రేక్షకులను మెప్పించింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ తర్వాత అంతటి రేంజ్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే మాత్రం రష్మిక అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో నా స్వామి రారా స్వామి అంటూ నడుము తిప్పేసి యువకుల మతులు పోగొట్టింది. ఒక్కసారిగా రష్మిక పాన్ ఇండియా స్టార్ ఎదిగింది. ఈ క్రమంలో ఆమె ఏకంగా బాలీవుడ్ లో 7 పెద్ద ప్రాజెక్టు లకు సైన్ చేసింది. అయితే రీసెంట్గా పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి బయటపడింది.

పుష్ప సినిమా భారీ హిట్ అవడంతో పుష్ప 2 సినిమాకు రష్మిక మందన డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, ఈ క్రమంలోనే సుకుమార్ ఆమె క్యారెక్టర్ ని సగం సినిమాలో చనిపోయే విధంగా రాసుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించే విధంగా స్టోరీని మార్చుకున్నాడు. దీంతో రష్మిక కెరీర్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకునేది. ఇలా అత్యాశకు పోయి ఎక్కువ పారితోషికం అడిగితే అనవసరంగా సినిమాలో ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటించే అవకాశం కోల్పోయిందని ఫాన్స్ బాధపడుతున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !