UPDATES  

 వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందే ఫీచర్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ లో ఈ ఫీచర్ దర్శనమిచ్చింది.

ప్రస్తుతం వాట్సాప్ లో ఒక సందేశాన్ని చెరిపేస్తే తిరిగి పొందే సదుపాయం లేదు. త్వరలో యూజర్లకు అన్ డూ బటన్ ను వాట్సాప్ అందించనుంది. ఒకరికి పంపిన సందేశాన్ని డిలీట్ చేస్తే, డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్లు కనిపిస్తాయని తెలిసిందే. డిలీట్ ఫర్ మీ ఆప్షన్ ఎంచుకుంటే, ఆ వెంటనే అన్ డూ బటన్ కూడా దర్శనమిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్ లో భాగంగా కొద్ది మందికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అప్ డేటెడ్ వెర్షన్ రూపంలో అందరికీ రానుంది.

మరో ఫీచర్ ను కూడా వాట్సాప్ పరిచయం చేయనుంది. గుర్తు తెలియని యూజర్లు తమ ఫోన్ నంబర్ చూడకుండా హైడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !