UPDATES  

 భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ పేరు ప్రస్తావించకుండా బీసీసీఐకి చురకలంటించాడు. బిలియన్ డాలర్స్ లీగ్ క్రికెటర్ల కంటే పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో నమయంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌తో ప్రపంచ మేటి ఆటగాళ్లు సిద్దమవుతున్నారని గప్పాలు కొట్టే బీసీసీఐ ఇప్పుడేం సమాధానం చెబుతుందని తన పరోక్ష వ్యాఖ్యలతో ప్రశ్నించాడు. ఇక రమీజ్ రాజా ఐపీఎల్‌ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.

గతంలోనూ భారత క్యాష్ రిష్ లీగ్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. బిలియన్ డాలర్ల లీగ్ అంటూ.. .. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. మరోవైపు అదృష్టానికి తోడుగా సంచలన ఆటతీరుతో పాకిస్థాన్ ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న టైటిల్ ఫైట్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పీసీబీ అధ్యక్ష హోదాలో ఆస్ట్రేలియాకు వచ్చిన రమీజ్ రాజాను మీడియా మందలించింది.

దాంతో రెచ్చిపోయిన రమీజ్ రాజా.. భారత క్యాష్ రిచ్ లీగ్‌ను టార్గెట్ చేస్తూ.. టీమిండియా వైఫల్యంపై సెటైర్లు పేల్చాడు. ‘బిలియన్ డాలర్ లీగ్ ఉన్న టీమ్స్.. మా కన్న వెనుకంజలో నిలిచాయి. మేం వారికంటే గొప్పగా ఆడాం’అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక పాకిస్థాన్ పుంజుకున్న తీరును కూడా రమీజ్ రాజా ప్రశంసించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా టెస్ట్ సిరీస్ జరగనుందని, వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు. ఈ సిరీస్‌పై తనకు ఎలాంటి అవగాహన లేదని చెప్పాడు.

‘భారత్-పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు.’అని స్పష్టం చేశాడు. 1992 సెంటిమెంట్ రిపీట్ అంటూ.. 1992 సెంటిమెంట్ రిపీట్ అంటూ.. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియానే వేదికగా జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఆ టోర్నీలో ఇప్పటిలానే పాకిస్థాన్, ఇంగ్లండ్ ఫైనల్ చేరాయి. టైటిల్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ పాక్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !