UPDATES  

NEWS

ఘనంగా ముగిసిన శ్రీ నాగులమ్మ తల్లి సుంకు పండగ… ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్..

 ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు భారీగా తరలి జయప్రదం చేయండి…

 

మన్యం న్యూస్ ఇల్లందు, నవంబర్23:- డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో 3ను యధావిధంగా అమలు చేసి ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ప్రభుత్వం 29 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని కోరారు. నిర్వాహిత ప్రాంతాల్లో స్ధానిక ఆదివాసీలు భూములు కోల్పోయిన వారికి , వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో యాజమాన్య లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అర్హులైన ఆదివాసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్పెషల్ డి. ఎస్. సి. వేసి ఆదివాసీ యువతీ, యువకుల చేతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధు మాదిరిగా ఆదివాసీ బందును ఇవ్వాలని ఆర్ధికంగా ఆదివాసీలను ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా, పట్టణ మండల కేంద్రాలలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు రేపటి నుంచి గ్రామస్థాయిలో ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !