మన్యం న్యూస్ వాజేడు, నవంబర్ 24 ధర్మవరం, పేరూరు గ్రామాలలో కార్డెన్ సెర్చ్ గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్, మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షణ కొరకు నిరంతరం సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అనుమానితులుగా ఎవరైనా ఉన్నట్లయితే తక్షణమే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు కు పాల్పడిన, చట్ట వ్యతిరేక పనులు కు సహకరించిన పోలీస్ తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
