మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు. నవంబర్ 24…పోడు అటవీ హక్కు పత్రాల నమోదు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ పై సబ్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మీసేవ ప్రొటల్ లో పోడు పట్టా నమోదు ప్రక్రియ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనుల అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాలని అన్నారు.మిగిలి ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ గ్రామసభలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రమాదేవి,ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచం,మండల ప్రత్యేక అధికారులు,అప్పయ్య,
భాగ్యలక్ష్మి, జడ్పిటిసి రుద్రమదేవి ఎంపీపీ రజిత ఆయ మండలల తాసిల్దారులు ఏం సత్యనారాయణ స్వామి,
పి మంజుల,ఎం శ్రీనివాస్, ఎంపీడీవోలు ఇక్బాల్,శ్రీధర్, ప్రసాద్,ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు గోవిందరావుపేట ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీఓ పోలురాజు గ్రామ కార్యదర్శులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.