UPDATES  

 జననేతకు ఘన స్వాగతం

జననేతకు ఘన స్వాగతం
– క్రాస్ రోడ్ నుంచి సారపాక వరకు భారీ ర్యాలీ
– రేగా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరికలు
– కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన రేగా
– వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి కానుంది : రేగా

మన్యం న్యూస్ , సారపాక నవంబర్ 24
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు బూర్గంపాడు మండలం టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘన స్వాగతం పలికారు. టిఆర్ఎస్ లో భారీగా యువత చేరేందుకు సిద్ధంగా ఉండడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు సారపాక విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మండల నాయకులు, కార్యకర్తలు భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి సారపాక వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. భద్రాచలం క్రాస్ రోడ్ వరకు కారులో వచ్చిన ఎమ్మెల్యే క్రాస్ రోడ్ నుంచి సారపాక వరకు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని, ద్విచక్ర వాహనం నడుపుతూ సారపాక చేరుకున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని ర్యాలీలో ద్విచక్ర వాహనం నడుపుతుండడంతో కార్యకర్తలు ఆనందంతో జై రేగా జై టిఆర్ఎస్ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సారపాక చేరుకున్నారు.

– రేగా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

సారపాక పట్టణంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో సారపాక పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన యువకులు అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు యువత పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని రిక్షా కాలనీలో యువత ఎమ్మెల్యే రేగా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. తమ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను యువకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడంతో అతి త్వరలో వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

– కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే రేగా
టిఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన యువతను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువకులు స్పష్టమైన ఆలోచనతో, లక్ష్యసాధనకు ముందుకు సాగాలని సూచించారు. పరిసర ప్రాంతంలో ఉన్న సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రేగా కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలు నిర్మూలనకు కృషి చేస్తూ, ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటుంటే ఓర్వలేక కొందరు మత రాజకీయాలను తెరమీదకు తీసుకువచ్చి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారు. వచ్చేది ఏ ఎన్నికైన గెలిచేది టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. కార్యకర్తల సైతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు
.
వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి కానుంది : రేగా

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో అగ్రగామికానందని ఎమ్మెల్యే రేగా ఆశాభవం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 142 మెడికల్ కాలేజీలో ప్రారంభించేందుకు సిద్ధమవగా… తెలంగాణ రాష్ట్రంపై వివక్షతతో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనకడుగు వేయకుండా రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభమవుగా మరికొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. మెడికల్ విద్యార్థులకు ఇబ్బందిగా కలగకుండా అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులను సైతం జరిపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సైతం ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని సదుపాయాలు సమకూర్చుకుంటున్నామని ఎమ్మెల్యే రేగా కాంతారావు వెల్లడించారు. నియోజకవర్గం లోని మణుగూరు 100 పలకల ఆసుపత్రి మెరుగైన వసతులతో ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అదే రీతిలో బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలను సైతం అభివృద్ధి చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని రేగా కాంతారావు తెలిపారు. ఇప్పటికే బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి అదనపు డాక్టర్లను ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. అతి త్వరలో బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందించేందుకు కృషి చేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరి వంశీ, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల కొట్టి పూర్ణ, టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చుక్కపల్లి బాలాజీ, బానోత్ శ్రీను, పంగి సురేష్, కార్యకర్తలు సాయి, అజయ్, ఆలిమ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !