మన్యం న్యూస్, సారపాక/ భద్రాచలం టౌన్ :
గ్రీన్ భద్రాద్రి వారు మొక్కలను పెంచుతూ వాతావరణ సమస్య కాపాడేందుకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షులు డా. సుదర్శన్ కొనియాడారు. గురువారం గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేట్ నందు కుండీలలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షులు డా. సుదర్శన్, డా. సీతారామ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రీన్ భద్రాద్రి వారు గత 11 సంవత్సరా పాటు పరిశ్రమించి మొక్కలు పెంచటం అనేది అభినందనీయమని పేర్కొన్నారు. మొక్కలు పెంచి వాతావరణ సమతోల్యాన్ని కాపాడడం భవిష్యత్ తరాల వారికి కూడా దీర్ఘాయుష్ని ఇస్తుందని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న గ్రీన్ భద్రాద్రి వారికి మా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు కామిశెట్టి కృష్ణార్జునరావు, కోశాధికారి శ్రీరంగం సంపత్, గ్రీన్ భద్రాద్రి ఫౌండర్ బొలిశెట్టి రంగారావు, గౌరవాధ్యక్షులు డా. గోళ్ళ భూపతి రావు, కట్టా నంగేంద్రబాబు, దూళిపూడి రాంబాబు, బిర్రుసుధాకర్, కడాలి నాగరాజు, కోటగిరి సత్యనారాయణ, రమేష్, అల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.