UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 జాబ్స్ ని కూడా వదిలేసుకుని వ్యవసాయం

వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. నిజానికి ఈ ప్రపంచంలోనే ఎక్కువ సాయం చేసేది రైతు అనే చెప్పవచ్చు ఎందుకంటే వ్యవసాయం లోనే సాయం ఉంది..వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు.. ఎం లేకపోయినా బ్రతకగలం, మనం ఆహారం తిసుకోకుండా బ్రతకగలమా.. అలాంటి ప్రపంచానికి సైతం మూడు పూటలా ఆహారానికి కావాల్సిన ముడి పదార్థాలను అందించేది రైతు.. రైతు పది వెళ్ళు భూమిలోకి వెళ్తేనే మన ఐదు వెళ్ళు నోటిలోకి వెళ్తాయి. నిజానికి దేశానికి వెన్నుముక లాంటివాడు. వివరాల్లోకి వెళ్తే.. అయితే కొంత మంది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో పైకి వెళ్ళచ్చు. ముంబై కి చెందిన పవిత్ర మరియు ఆమె భర్త జాబ్స్ ని కూడా వదిలేసుకుని వ్యవసాయం మొదలుపెట్టారు.

ఈ మధ్య కాలం లో ప్రతిదీ కూడా మారిపోయింది. ఫాస్ట్ పేస్డ్ సిటీ లైఫ్ ని కాదనుకుని ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారాన్ని పండించాలని అనుకున్నారు. చక్కగా అనుకున్నది సాధించడానికి కృషి చేశారు. 2016లో పవిత్ర హెచ్ఆర్ జర్నలిస్ట్ జాబ్ ని వదిలేసుకుని వ్యవసాయంపై దృష్టి పెట్టింది. తన భర్త కూడా ఉద్యోగాన్ని వదిలేసుకుని పండించడం మొదలుపెట్టారు. 15 ఎకరాల భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి వీళ్లిద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 20 ఎకరాలలో ఈ జంట 15 టన్నులని పండిస్తున్నారు. సంవత్సరానికి సుమారు 15 టన్నుల బియ్యాన్ని వాళ్లు 20 ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు వ్యవసాయం పైన దృష్టి పెడుతున్నారు వీళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి.. దాని ద్వారా మంచిగా సంపాదించుకుంటున్నారు. పైగా నచ్చినది చేయడంలో ఆనందం వేరు ఇలా మంచిగా కష్టాన్ని నమ్ముకుని నచ్చిన పనిని వీళ్ళు చేస్తున్నారు. ఏదో చేయాలని చేయలేకపోతున్న వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇలా మంచి వాటి కోసం కష్టపడితే తప్పక గెలవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !