UPDATES  

 సమరసింహారెడ్డికి 200 రెట్లు అధికంగా “వీరసింహారెడ్డి”

నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” సంక్రాంతి పండుగకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ బాలయ్యకి ఎంతో కలిసొస్తది. కానీ గత రెండు సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగకు సరైన వాతావరణం లేకపోవడంతో కరోనా కారణంగా.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు.. పెద్ద బిజినెస్ జరగలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నార్మల్ కావడంతో… ఈ సంక్రాంతి పండుగకు బాలయ్య నటించిన “వీరసింహారెడ్డి” బరిలోకి దిగుతుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. శృతిహాసన్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్యని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించినట్లు సినిమా షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ మరియు కర్నూలులో జరిగిన షూటింగ్ వీడియోలు బట్టి అర్థం అవుతుంది. సమరసింహారెడ్డికి 200 రెట్లు అధికంగా “వీరసింహారెడ్డి” ఉంటుందని.. డైరెక్టర్ చెప్పడంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ నవంబర్ 25వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. “రాజసం నీ ఇంటి పేరు” అనే క్యాప్షన్ పెట్టి నవంబర్ 25వ తారీకు ఉదయం 10:29 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు బాలయ్య ట్రాక్టర్ నడుపుతున్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి”తో పాటు చిరంజీవి.. “వాల్తేరు వీరయ్య” విడుదల అవుతూ ఉండటంతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫైట్.. ఏర్పడనుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి.. బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండటంతో సంక్రాంతి ఎవడు కొడతారో అన్నది సస్పెన్స్ గా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !