UPDATES  

 యాపిల్‌ కంపెనీ సెకనుకు 1,820 డాలర్లు అంటే రూ. 1.48 లక్షల నికర లాభం

ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా పేరొందిన యాపిల్‌ కంపెనీ సెకనుకు 1,820 డాలర్లు అంటే రూ. 1.48 లక్షల నికర లాభం సంపాదిస్తోంది. ఈ కంపెనీ రోజు సంపాదన 15.7 కోట్ల డాలర్లు అంటే రూ. 1282 కోట్లు. అమెరికాలో ఓ వ్యక్తి వార్షిక సగటు జీతం 74,738 డాలర్లు. అంటే అతను వారానికి సంపాదించే మొత్తాన్ని యాపిల్‌ కంపెనీ ఒక సెకనులో సంపాదిస్తుందన్నమాట.

ఆ తరవాతి స్థానంలో మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే సంపాదిస్తున్నాయి. ఈ మూడు కంపెనీలు సెకనకు 1000 డాలార్లకు పైగా సంపాదిస్తున్నాయి. ఇది ఆదాయం కాదు… అన్ని ఖర్చులు పోను నికర లాభం. ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ ప్రకారం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సెకనుకు 1404 డాలర్లు అంటే రూ. 1.14 లక్షల లాభం సంపాదిస్తుండగా, బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే సెకనుకు 1348 డాలర్లు (రూ. 1.10 లక్షలు) లాభం సంపాదిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !