UPDATES  

 అయ్యో పాపం చిట్టి చేతులకు పెద్ద కష్టం

  • అయ్యో పాపం
  • చిట్టి చేతులకు పెద్ద కష్టం
  • కస్తూరిబా పాఠశాలలో మట్టి మోస్తూ
  • విద్యార్థుల వెట్టి చాకిరి
  • సార్లు వస్తున్నారని అర్ధరాత్రిలో పనులు చేపించిన ఉపాధ్యాయులు.

మన్యం న్యూస్ గుండాల నవంబర్ 24.. బడిలో గడపాల్సిన బాల్యం బజారులో మట్టి పనులు చేపిస్తున్న విద్యా ప్రబుద్ధులు. పిల్లలు బడికి పెద్దలు పనికి నినాదమే నెవ్వరు పోయే విధంగా విచక్షణ జ్ఞానాన్ని మరిచి పాఠాలు చెప్పే పంతులే ఆ చిట్టి చేతులకు పనులు చెప్పారు. మాస్టారు కోప పడతారని ఒంట్లో సత్తువ లేకుండా మట్టి పనుల్లో విద్యార్థినీలు నిమగ్నమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినిలు అర్ధరాత్రి మట్టి మట్టి మోస్తూ చెమటోడుస్తున్న పంతులు మాత్రం దగ్గరుండి మట్టి పనులు చేయించడం పలు సంచలనానికి దారి తీసింది. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదుగుతారని తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నమ్మి చేర్పిస్తే ఇక్కడి సిబ్బంది మాత్రం వాళ్ల ఉన్నతాధికారుల మెప్పుకోసం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలగుపారా ఇచ్చి పదుల సంఖ్యలో విద్యార్థినులతో మట్టి మోపిచ్చి లోపట చదును చేయిస్తున్నారు. రాత్రి వేళల్లో అమ్మాయిల చేత చీకటిలో సైతం పని చేయాలంటూ హుకుం జారీచేసి పాఠశాల సిబ్బంది పని చేయించడం చర్చనీయాంశంగా మారింది. పిల్లల చదువు ఏమో కానీ అర్ధరాత్రి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని కొందరు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఇదే పాఠశాలలో విద్యార్థుల చేత అనేకమార్లు పనులు చేయించిన అవి బయటికి రాకుండా లోలోపలే చేయించడం వలన కొందరి విద్యార్థినులు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపణలు సైతం తలెత్తిన పాఠశాల సిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు విద్యాశాఖ అధికారులు దీనిపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
*ఈ విషయంపైజి ఈ సి ఓ అన్నామని మన్యం న్యూస్ వివరణ కోరగా విద్యార్థినిలతో పనులు చేయించడం సరైనది కాదని పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి జిల్లా ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !