మన్యం న్యూస్, మణుగూరు, నవంబర్ 26: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ఆయన సతీమణితో కలిసి ప్రధానం వేడుకలు పాల్గొన్నారు. టెలిఫోన్ ఎక్స్ చేంజ్ ఏరియాకు చెందిన పెద్దాడి సీత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేస్తుంది. ఆమె కూతురు రాధ ప్రధానం వేడుకకు హాజరై కాబోయే వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా సతీమణి సుధారాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.