హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మించిన భవనంలోకి మారనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలో 2023 జనవరి తొలి వారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. నానక్‌రాంగూడలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పనిచేయనున్నాయి. గత నెలలోనే బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 2002 అక్టోబర్ 24న బేగంపేటలో ప్రారంభమైన యూఎస్ కాన్సులేట్ వచ్చే ఏడాది జనవరిలో నానక్‌రాంగూడకు మారనుంది.