UPDATES  

 ఏపీకి భారీగా నిధులు కేటాయించడం వెనుక బీజేపీ ప్లాన్

ప్రస్తుతం ఏపీకి కేంద్ర నుంచి సహకారం చాలా అవసరం. ఎందుకంటే.. కొత్త రాష్ట్రం, విభజన సమస్యలు కూడా తీరలేదు. మరోవైపు సరైన రాజధాని లేదు. ఇన్ కమ్ సోర్స్ లేదు. ఈనేపథ్యంలో వైసీపీ సర్కారుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలే ఎన్నికల కాలం. ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అడిగిన వాటికి ఓకే చెప్పేసింది. ముఖ్యంగా ఏపీలో పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టులు, వాటి నిర్మాణాలకు నిధులను మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. 9 వేల కోట్ల రూపాయలను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి సీఎం జగన్ కోరిన ప్రతిపాదనలపై ఓకే చెప్పింది. ఏపీకి భారీగా నిధులు కేటాయించడం వెనుక కేంద్రం ప్లాన్ ఏంటి? అనేది పక్కన పెడితే ఏపీకి ఒక్కసారిగా భారీగా నిధులు రావడం మాత్రం మంచి పరిణామమే. ఇది ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి అంటే వైసీపీ సర్కారుకే ప్లస్ పాయింట్ కానుంది.

.ఇటీవలే 15 వేల కోట్లతో ఏపీలో నిర్మించబోయే రోడ్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేశారు. దానికి సీఎం జగన్ కూడా హాజరయ్యారు. ఏపీకి భారీగా నిధులు కేటాయించడం వెనుక బీజేపీ ప్లాన్ ఏంటి? రాయలసీమలో రెండో దశలో వేయబోయే 412 కిలోమీటర్ల రోడ్ల కోసం రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదించింది. దీంతో ఈనెల 28న తిరుపతిలో భూమిపూజ జరగనుంది. అయితే.. ఉన్నపళంగా ఏపీకి నిధులు రావడం వెనుక పవన్ ఉన్నాడంటూ చెబుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల ప్రధాని మోదీతో పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఏపీకి సంబంధించిన అభివృద్ధిపై పవన్ తో మోదీ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏపీకి కేంద్రం దృష్టి పెట్టడం శుభపరిణామమే అని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !