UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం

ఆర్థిక మాంద్యం తరుముకొస్తోంది. 2008 నాటి పరిస్థితులను పునరావృతం చేస్తోంది. వేలాది మంది ఉద్యోగాలు పోయాయి.. పెద్ద సంస్థలు లే _ ఆఫ్ ప్రకటిస్తున్నాయి.. ఇందుకు ఏ దేశం కూడా అతీతం కాదు. పంచుడు కార్యక్రమాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు, దీర్ఘకాలిక అభివృద్ధి పై దృష్టి సారించకపోవడంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సర్కార్ నుంచి కూడా అందే సాయం ఏమీ ఉండదు. అందుకే ఈ పరిస్థితిలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే తీరుగా జీవన విధానాన్ని మలుచుకోవాలి.. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ లాంటివాడే.. దుబారా ఖర్చులు తగ్గించుకోండి అని సూచించాడు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జల్సాలు వద్దు బాస్ చేతిలో ఐటి కొలువు.. 5 అంకెల జీతం.. 30 ఏళ్ళ లోపు వయసు.. శని, ఆది సెలవులు. ఖాళీగా ఉన్న మనసు ఊరుకుంటుందా.. రక రకాల కోరికలు కోరుతుంది.. ఫలితంగా రాకెట్ వేగంతో ఖర్చులు అవుతుంటాయి. ఇవన్నీ కూడా సవ్యంగా ఉన్నప్పుడే.. మరి ఒకేసారి ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి? జిందగీ ముందుకెళ్లే దారి ఏంటి? సమయం బాగా లేనప్పుడు సరదాలు వాయిదా వేసుకోగలంగానీ.. బ్యాంకు వాయిదాలు, అత్యవసర ఖర్చులు, నెట్, ఫోన్ బిల్లులను సర్దుకోవడం ఎలా? దీనికి ముందు చూపు పరిష్కారాన్నే ‘కెరియర్ కుశనింగ్’ అంటున్నారు నిపుణులు. కెరియర్ కుశనింగ్ అంటే.. ఒక కొలువు పోయినా.. మరొక దాంట్లో కుదురుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే కెరియర్ కుశనింగ్. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం, రెండేళ్ల కిందట విరుచుకుపడ్డ కరోనా అనుభవాలతో యువ ఉద్యోగులు ఈ ధోరణి ఎక్కువగా ఆకళింపు చేసుకున్నారు.. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఉద్యోగం శాశ్వతం అనే భావన వీడుతున్నారు.

అంతా సభ్యంగా ఉన్నప్పుడే ఏమరపాటు వదిలి జాబ్ పోర్టళ్ళల్లో వివరాలు నమోదు చేసుకోవడం, ఇతర సంస్థలో పనిచేసే స్నేహితులు, నెట్వర్క్ లతో టచ్ లో ఉండటం, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాలు పెంచుకోవడం, సామాజిక మాధ్యమాల్లోని ఉద్యోగార్థుల గ్రూపుల్లో చేరటం, భద్రత లేని కొలువులు మారే ప్రయత్నం చేయడం ఇందులో భాగాలు.. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి ఇప్పుడు ఉద్యోగం మానేయడం, కొలువు వదిలేందుకు సిద్ధంగా ఉండటమే కెరియర్ కుశనింగ్. ఒక అధ్యయనం ప్రకారం ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెట్టినా ఇప్పటికిప్పుడు కొలువులు వదిలేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని 44% మంది ధీమాగా చెబుతున్నారు. Economic Depression 2022 మితిమీరిన ఖర్చు వద్దు అతి ఎప్పుడు కూడా అతే. అందుకే చూసి ఖర్చు పెట్టుకోవాలి. డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు.. అందుకే జాగ్రత్త చాలా ముఖ్యం.. ఇక సరదాలు మితిమీరితే దుబారాగా మారుతాయి. యువతలో ఇది ఎక్కువ.. ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది కాబట్టి.. ఉన్నదాంతో సర్దుకుపోవాలి. ఆచి తూచి ఖర్చు పెట్టాలి. ఇది అలవాటుగా మారితే ఆర్థిక మాంద్యం పెద్దగా ఇబ్బంది పెట్టదు. అసలే గడ్డుకాలం కాబట్టి ఈ సమయంలో కంపెనీలు మారడం, కొత్త బాధ్యతలు తలకెత్తుకునే పోస్టుల్లోకి వెళ్ళటం ఏటికి ఎదురు వెళ్ళడం లాంటిదే. వెళ్లిన కొత్త చోట పని సామర్థ్యాన్ని సమర్ధంగా నిరూపించుకోలేక పోతే ఇక అంతే సంగతులు.. నాకేంటి… ఐదు అంకెల జీతం… భద్రమైన జీవితం… అని అతివిశ్వాసానికి పోవద్దు.. జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదు.. ఉద్యోగంలో ఏళ్ల నుంచి కుదురుకొని ఉన్నా ఏమరపాటుగా అసలు ఉండకూడదు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నించాలి.. అంటే దీని అర్థం అడ్డదారులు తొక్కమని కాదు. నైపుణ్యాలు పెంచుకోమని. అలా పెంచుకున్న నైపుణ్యాలు రేపటి నాడు అక్కరకు వస్తాయి.. పెద్దరాయిని గునపంతో లేపుతున్నప్పుడు చిన్న రాయి అవసరం పడుతుంది.. ఈ చిన్న రాయి ఏం చేస్తుంది లే అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు.. అందుకే ఈ గడ్డు కాలంలో జాగ్రత్తగా మసులుకోవాలి.. ఖర్చులు పెట్టొద్దు అనడం లేదు.. దుబారా ఖర్చులు అసలు వద్దు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !