UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. ‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న ‘జాన్ వీక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి” అని అన్నారు. సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !