UPDATES  

 26/11 Mumbai Attacks నిత్యం మరణ హోమమే

26 నవంబరు, 2008.. దేశం కాదు ప్రపంచం మొత్తం ఉలిక్కి పడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో నిమిషాల తేడాలోనే ఎనిమిది చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి.. ఛట్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రై డెంట్, తాజ్ హోటల్, లియో పార్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్,మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధిలో, ఇవి గాక సెయింట్ జేవియర్ కాలేజీ, పోర్ట్ దగ్గర మాజగావ్ ఏరియా, విలే పార్లే వద్ద ట్యాక్సీ లో మొత్తం 8 చోట్ల భారీ, మూడు చోట్ల స్వల్ప పేలుళ్లు సంభవించాయి. ఈ మారణ హోమం లో 170 మంది కన్నుమూసారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి లష్కరే_ తోయిబా ఉగ్రవాదులు సముద్రం మీదుగా ముంబై మహానగరంలో చొరబడి విధ్వంసం సృష్టించారు. 26/11 Mumbai Attacks నిత్యం మరణ హోమమే 2004 నుంచి 2014 దాకా యూపీ ఏ హయాంలో దేశంలో పలుచోట్ల బాంబుదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో వందలాది మంది చనిపోయారు. వేలమంది శాశ్వత దివ్యాంగులుగా మారిపోయారు.. వీటి అన్నింటికీ కారణం భద్రతా వైఫల్యమే. ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిద్రాణంగా ఉంచడమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోం శాఖలో ఆర్ వి ఎస్ మణి అనే అధికారి కీలక బాధ్యతల్లో పని చేసే వారు. ఆ సమయంలో దేశ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఇక మహారాష్ట్రలోని నాందేడ్ లో బాంబుల దాడి తర్వాత దేశ భద్రతపై సమావేశం జరిగింది. అప్పటి హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్, దిగ్విజయ్ సింగ్, హేమంత్ ఖర్కరే వంటి వారు ఇందులో పాల్గొన్నారు. సంజవుత, మాలేగాం, మక్కా మసీదు ప్రాంతాల్లో జరిగిన పెద్దపెద్ద బాంబుదాడుల వెనుక పాకిస్తాన్ సహాయం పొందుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యు ల్స్ ఉన్నాయని అప్పట్లో మణి చెప్పారు..

కానీ వారిపై దాడులకు అప్పటి ప్రభుత్వం వెనుకాడింది. వీటిని హిందూ దాడులుగా చూపించాలని హోంశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చింది..మణి దీనికి ఒప్పుకోకపోవడంతో ఆయనకు అనేక రకాల ఇబ్బందులు సృష్టించారు. అనుమానిత తీవ్రవాదుల అరెస్ట్ కు అడ్డుపడటం, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చేవారని సమాచారం. ఇక అప్పట్లో హిందూ టెర్రర్, సాఫ్రాన్ టెర్రర్ అనే పదాలు విరివిగా ఉపయోగించేవారు. ఎన్ ఐ ఏ ఎందుకు రంగంలోకి దిగలేదు సాధారణంగా ఏదైనా బాంబు పేలుళ్లు జరిగితే, ఎవరైనా దాడులకు పాల్పడే అవకాశం ఉంటే.. వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగుతుంది. అయితే అజ్మీర్ దర్గా, సంజవుతా ఎక్స్ ప్రెస్, మక్కా మసీదుల్లో పేలుళ్లకు సంబంధించిన కేసుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులను అరెస్టు చేస్తే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు రంగంలోకి దిగేవారు కాదనే ఆరోపణ ఉంది. ఇదే సమయంలో స్వామి ఆసీమానంద, సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ ను అరెస్టు చేయడం ఎన్ ఐ ఏ పని తీరుకు నిదర్శనం. ఎన్ ఏ సీ లో వామపక్ష వాదులు యూపీఏ హయాంలో కేంద్ర క్యాబినెట్ కు సలహాలు ఇచ్చేందుకు ఎన్ ఏ సీ నేషనల్ అడ్వైజరి కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దానికి సోనియాగాంధీ అధ్యక్షురాలుగా ఉండేవారు. అందులో వామపక్ష సానుభూతిపరులు అరుణా రాయ్, హర్ష మండర్, యోగేంద్ర యాదవ్ వంటి వారు ఉన్నారు..ఇక అరుణా రాయ్, యోగేంద్ర యాదవ్ వంటి వారు కసబ్ కు క్షమా భిక్ష పెట్టాలి అని ఉద్యమం కూడా నడిపారు. 26/11 దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రం ద్వారా వస్తున్నారని అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ సీ ఐ ఏ భారత్ కు సమాచారం ఇచ్చింది. కానీ దానిపై ప్రభుత్వం స్పందించలేదు. కానీ వీటిని కాషాయ దాడులుగా చూపించేందుకు నానా ప్రయత్నాలు చేసింది.. ఈ దాడుల ముఖ్య సూత్రధారి కసబ్ తన చేతికి కాషాయ రంగు తాళ్ళు కట్టుకున్నాడు. దాడులు జరిగిన తర్వాత దిగ్విజయ్ సింగ్, మహేష్ భట్ ఆర్ ఎస్ ఎస్ హస్తం ఈ దాడులు వెనుక ఉన్నది అనే పుస్తకం విడుదల చేశారు.. రాహుల్ గాంధీ అయితే మా దేశం లో లష్కరే తో యి బా కంటే హిందూ తీవ్రవాదం ప్రమాదమని అమెరికా అంబాసిడర్ తో చెప్పారు. కానీ హేమంత్ ఖర్కరే ను ఎవరు చంపారో మాత్రం చెప్పలేదు..26/11 దాడులకు ముందు భారత రక్షణ ఉన్నత అధికారులు అధికారిక పర్యటన కోసం పాకిస్తాన్ వెళ్లారు. ఇక్కడ దాడులు జరిగే సమయానికి వారు అక్కడ విందులు ఆరగిస్తున్నారు. ఒకేసారి అంతమంది అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పటికి కూడా సందేహాస్పదమే. ముంబై దాడుల టెర్రరిస్టుల బోట్ పై నావీ అధికారులు నిఘా పెట్టవద్దు అనే ఆదేశాలు అందాయి. దీన్ని సాక్షాత్తు అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో చెప్పారు.. మరి ఆదేశాలు ఇచ్చింది ఎవరో చెప్పలేదు. అంత భారీ దాడులు జరిగితే హోంశాఖ మంత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి ఉగ్రవాదులను పట్టుకునే బాధ్యత అప్పగించేందుకు ఎందుకు వెనకాడారు? మహేష్ భట్ కుమారుడు టెర్రరిస్ట్ డేవిడ్ హడ్లే కు సహాయం చేశాడని రుజువు చేసినా చర్యలు తీసుకోలేదు. ముంబై దాడులు జరగవచ్చని హెచ్చరించిన ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారి కల్నల్ పురోహిత్ మీద తప్పుడు కేసు పెట్టి, కారాగారంలో చిత్ర హింసలు పెట్టారు. కాంగ్రెస్ వైఫల్యమే కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ రాసిన కొత్త పుస్తకంలో ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్పై భారత్ దాడి చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకొచ్చారు. అలాగే అప్పటి ఎన్డీ టీవీ పాత్రికేయురాలు బుర్ఖా దత్ ముంబై పేలుళ్ల లో పోలీస్ చర్యల గురించి మినిట్ టు మినిట్ లైవ్ టెలీ కాస్ట్ ఇవ్వడంతో హోటల్లో ఉన్న టెర్రరిస్టులకు సెక్యూరిటీ సమాచారం తెలుసుకునే అవకాశం లభించింది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. ఇదే సమయంలో లష్కరే టెర్రరిస్టు మాడ్యూల్ ఇశ్రాత్ జహాన్ సహా ముగ్గురు తీవ్రవాదులను గుజరాత్ పోలీసులు హతమార్చారు.. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని డి ఐ జి తో సహా గుజరాత్ పోలీసులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. 26/11 Mumbai Attacks అమిత్ షా ను జైల్లో వేశారు సోహ్రబుద్దీన్ అనే వ్యక్తిపై ఉగ్రవాది అనే ముద్ర వేసి గుజరాత్ హోంశాఖ మంత్రి అమిత్ షా చంపించారు అని నెపం వేసి జైలుకు పంపించారు. ఆరు నెలలపాటు రాష్ట్ర బహిష్కరణ చేశారు. పలువురు గుజరాత్ పోలీసులను ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విడుదల చేసింది. దేశంలో అప్పట్లో అన్ని దాడులు జరిగినా ఖాతరు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం…ఉగ్రవాదుల పై దాడిని మాత్రం వివాదం చేసింది. ఇష్రత్ పోరాట పటిమ కలిగిన యోధురాలు అని లష్కరే తన వెబ్ పేజీలో రాస్కొచ్చింది. ఆమె ఆమె టెర్రరిస్ట్ కాదని కాంగ్రెస్ నాయకులు నిరూపించే ప్రయత్నం చేయడం గమనార్హం.. ఆమె టెర్రరిస్ట్ అని రుజువైన తర్వాత కాల్చి చంపుతారా? ప్రభుత్వానికి పట్టించి ఇవ్వాలని వితండవాదం చేసింది. దాడుల రోజు కసబ్ పాకిస్తాన్ వాళ్లతో మాట్లాడిన ఫోన్ విచారణ అధికారికి ఇవ్వకుండా పోలీస్ కమిషనర్ పరం బీర్ దాచిపెట్టాడని విశ్రాంత ఏసిపి సంషేర్ ఖాన్ ఆరోపించడం గమనార్హం. ఇవన్నీ కూడా నిజాలు. కాంగ్రెస్ చేసిన తప్పిదానికి దేశం చెల్లించుకున్న మూల్యాలు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !