జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికి మన జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు, జుట్టు పొడిబారడం ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ సమస్యల నుండి బయట పడడానికి మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను, నూనెలను, హెయిర్ కండీషనర్ లను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల తాతాల్కిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. శాశ్వతంగా మనకు ఎటువంటి పరిష్కారం లభించదు. అలాగే వీటిని వాడడం వల్ల అనేక దుష్ర్పభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సహజ సిద్దంగా లభించే పదార్థాలతో మన ఇంట్లో హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలన్నింటిని శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఈ హెయిర్ ను ప్యాక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఉపయోగించాల్సిన వస్తువు పెరుగు. పెరుగును వాడడం వల్ల చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వాతవరణ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది జుట్టు పొడిబారి తెగిపోతూ ఉంటుంది.
ఇలాంటి సమస్యలను కూడా మనం పెరుగును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. పెరుగు మన జుట్టుకు ఒక కండిషనర్ లా పనిచేసి జుట్టు పట్టులా మారుస్తుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండవ వస్తువు నిమ్మరసం. దీనిని ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. Soapberry Powder అలాగే ఈ ప్యాక్ తయారీలో ఉపయోగించే వాటిల్లో కుంకుడు కాయ పొడి కూడా ఒకటి. కుంకుడు కాయ మన జుట్టుకు ఒక క్లెన్సర్ లా పని చేస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును, దురదను తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును అందంగా, మెరుస్తూ ఉండేలా అలాగే జుట్టును పొడిబారకుండా చేయడంలో కూడా కుంకుడు కాయ మనకు దోహదపడుతుంది. ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఈ మూడు పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని, రెండు టీ స్పూన్ల కుంకుడు కాయల పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. తరువాత దీనిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపును ఉపయోగించకుండా తలస్నానం చేయాలి. మరుసటి రోజూ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి ఒకసారి వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.