బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ మొబిలిటీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ విద్యుత్ ఎస్‌యూవీ ‘డిఫైనీ’ మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ వంటి విద్యుత్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్న ఈ ఎస్‌యూవీ ధరను రూ.39.5 లక్షలుగా నిర్ణయించింది. . ఆడీ ఈ-ట్రాన్, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్‌ను ఆవిష్కరించింది.
ఈ నయా మోడల్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్ చీఫ్ స్ట్రాటజీ అధికారి రామ్ ద్వివేది తెలిపారు. బ్యాటరీ రీచార్జితో 500 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు 402 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నదన్నారు. ఆఫ్‌రోడ్ మిలిటరీ వెర్షన్ ఎస్‌యూవీ వీర్‌ను కూడా కంపెనీ లాంఛనప్రాయంగా పరిచయం చేసింది.