ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా లేటెస్ట్ గా చిరంజీవి , నందమూరి బాలకృష్ణతో ఓ చిన్న పాప దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చిరంజీవి బాలకృష్ణ లతో విడివిడిగా ఫోటో దిగడమే చాలా కష్టం అలాంటిది ఇద్దరితో కలిసి ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఎవరు ఈ చిన్నారి అంటూ సామాజిక మాధ్యమాల్లో వెతుకుతూ వస్తున్నారు. అయితే ఆమె మరెఎవరో కాదట స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, కూతురు ప్రియాంక దత్ అట. సినిమాలను వ్యాపారంగా కాకుండా చాలా ఇష్టంతో భావించేవాడు అశ్విని దత్. వైజయంతి బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన అశ్వినీ దత్ విలువలతో కూడిన సినిమాలను తీస్తూ ఉంటాడు. ఇక ఆయన కూతురైన ప్రియాంక దత్ కూడా తండ్రి బాట ను ఎంచుకొని నిర్మాణ రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది . పవన్ కళ్యాణ్
, ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారికి కూడా నిర్మాతగా పనిచేసింది. అయితే ఈమె మూవీలోకి రాకముందు బొంబాయి లోని ఓ దర్శకుడు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట. ఆ తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 2009లో త్రీ ఏంజెల్ స్టూడియో పేరుతో ఒక సంస్థను నిర్మించారు. ఇక ఈ బ్యానర్లో నారా రోహిత్ యాక్ట్ చేసిన బాణం , నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ, కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలు వచ్చాయి. ఇలా సందేశాత్మకంగా ఉండే చిత్రాలు నిర్మిస్తూ, సినిమా పట్ల మంచి అభిరుచిని సమాజం పట్ల బాధ్యతలు చూపిస్తూ వస్తున్నారు ప్రియాంక దత్ . అలాగే హాస్యనటుడు ప్రియదర్శి యాక్ట్ చేసిన “మెయిల్” అనే చిత్రాన్ని కూడా ప్రియాంక దత్ నిర్మించారు. నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ,పర్య అబ్దుల్లా నటించిన జాతిరత్నాలు సినిమా కు కూడా ఇమే నిర్మాతగా చేశారు.