UPDATES  

 అగ్రరాజ్యంలో అత్యుత్తమ విద్య

అమెరికా అంటే.. ఒక్క భారత్ కు మాత్రమే కాదు. మన పొరుగున ఉన్న చైనా నుంచి తువాలు దేశం వరకు క్రేజ్ ఉంటుంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు.. అమెరికా చెప్పుకునేందుకు ధనవంతమైన దేశమే.. కానీ అక్కడ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అమెరికాలో విద్య, ఉద్యోగం చాలామందికి ఒక కల. అగ్రరాజ్యంలో అత్యుత్తమ విద్య పూర్తి చేసుకొని, మంచి అవకాశం సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలనుకునేవారు కోకొల్లలు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.. విద్యాపరంగా పిల్లలకు అత్యుత్తమ చదువు అందుతుందన్న ఉద్దేశంతో ఎక్కువమంది అమెరికాకు వస్తూ ఉంటారు. కానీ అమెరికాలో ప్రాథమిక విద్య ఏమంత గొప్పగా ఉండదు. డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సుల నాణ్యత మాత్రం అత్యున్నతంగా ఉంటుంది. పైగా విద్యా వ్యయం కూడా చాలా భారీగా ఉంటుంది. అయినప్పటికీ భారత్ కంటే అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉంటాయి. ప్రీ స్కూల్ భారత్ లో ₹9,081 తో పూర్తి అయితే.. అదే న్యూ యార్క్ లో అయితే 1,99,664 వెచ్చించాలి. భారతదేశంలో ఉన్నత విద్య పరంగా క్రమంగా పరిస్థితుల్లో మార్పు వస్తున్నది. యూనివర్సిటీలు పరిశోధనపై మరింత వ్యయం, శ్రద్ధ పెడుతున్నాయి.. ముఖ్యంగా ప్రొఫెసర్లు తిరిగి భారతీయ యూనివర్సిటీల్లో చేరిపోతున్నారు. భారతదేశంలో విద్య ఎక్కువగా పుస్తక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో ప్రాక్టికల్ అంశాలపై ఆధారపడి ఉంటుంది. India And USA Lifestyle ఖర్చు చాలా ఎక్కువ మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, భారత్ వంటి దేశాల్లో జీవన వ్యాయానికి సంబంధించి రోజువారి ఖర్చు పెరిగిపోతోంది.. న్యూయార్క్ లో క్యాపచినో 439 రూపాయలకు లభ్యమవుతుంది. ముంబాయిలో అయితే 203 వెచ్చించాల్సి ఉంటుంది.

ముంబైలో కిలో బియ్యం రూ. 31 కే లభ్యమైతే, న్యూ యార్క్ లో 297 రూపాయలు చెల్లించాలి. ఒక కిలోమీటర్ టాక్సీ లో వెళ్ళినందుకు ముంబైలో అయితే 40 రూపాయలు ఇస్తే సరిపోతుంది.. అదే న్యూయార్క్ లో అయితే 204 రూపాయలు చెల్లించాలి. వినోదం కోసం వెళ్లే సినిమాకు సంబంధించి ఒక్కో టిక్కెట్టు పై ముంబైలో 350 రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. అదే న్యూయార్క్ లో అయితే 1,470 ఇవ్వాలి. ఇక అద్దె విషయానికొస్తే ముంబైలో అయితే 41,000 ఇస్తే సరిపోతుంది. అదే న్యూయార్క్ లో అయితే మూడు లక్షల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ లైన్ అయితే ముంబైలో 418 రూపాయలు చెల్లించాలి. అమెరికాలో అయితే 398 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.. ఇక మిగతా ఇంటి నిర్వహణకు 3,700 వెచ్చిస్తే ముంబైలో సరిపోతుంది.. కానీ న్యూయార్క్ లో అయితే 14 వేల దాకా వదిలించుకోవాలి. పోల్చి చూసింది ఎందుకంటే ప్రపంచీకరణ వేగంగా పెరుగుతున్నది. దేశాల మధ్య అంతరాలు క్రమంగా తొలగిపోతున్నాయి. సాంస్కృతిక విప్లవం అనేది క్రమంగా చొచ్చుకు వస్తున్నది. అసలు అమెరికా అంటే తెలియని ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులు పై చదువుల కోసం శ్వేత దేశానికి వెళ్తున్నారు.. దీంతో అనివార్యంగా ఆదేశ ప్రస్తావన వస్తున్నది.. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం అందరిలోనూ కలుగుతున్నది.. అయితే ప్రస్తుతం ఆర్థికమాంద్యం ముసురుకుంటున్న వేళ అమెరికాలో, భారత దేశంలో ఖర్చులు ఎలా ఉంటాయి అనే విధానంపై ‘పర్చేసింగ్ పవర్ పార్టీ’ ఒక అధ్యయనం నిర్వహించింది. అమెరికా, భారతదేశంలో కరెన్సీ విలువ, ప్రజలు వారి జీవనానికి సంబంధించి చేస్తున్న వ్యయం అన్నింటిని మదింపు చేసింది. India And USA Lifestyle అమెరికాలో నిత్యావసరాలను బాస్కెట్ రూపంలో తీసుకుంటారు. అక్కడ ఒక బాస్కెట్ వచ్చేసి 50 డాలర్ల వరకు పలుకుతుంది.. డాలర్ విలువ 80 రూపాయలు అనుకుంటే.. ఒక బాస్కెట్ ఖరీదు 8వేల దాకా ఉంటుంది. అదే బాస్కెట్ ఇండియాలో చాలా తక్కువ ఖరీదు ఉంటుంది.. భారతదేశంలో సరాసరి జీవన వ్యయం 416$ గా ఉంది. అదే అమెరికాలో అయితే 2,012$ గా ఉంది.. వైద్య సదుపాయాలు వైద్య సదుపాయాల విషయానికొస్తే అమెరికాలో భారత్ కంటే మెరుగ్గా ఉంటాయి. వైద్య బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆస్పత్రి ఖర్చులను బీమా కంపెనీలే భరిస్తాయి. ప్రీమియం భారమైనప్పటికీ.. అన్ని అనారోగ్య సమస్యలు కవర్ అయ్యే విధంగా బీమా తీసుకోవాలి. లేదంటే హాస్పిటల్ బిల్లు చూసి షాక్ కు గురికావాల్సి వస్తుంది. పెద్ద సర్జరీలు, వైద్య చికిత్సలు మనదేశంలోనే చౌక. అయితే మన దేశంలో నాణ్యమైన వైద్య సేవలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !