UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు

ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పేరు లేదు. కేవలం సమీర్‌ మహేంద్రుపై మాత్రమే చార్జిషీటు దాఖలు చేశారు. త్వరలోనే ఇతరులపై కూడా చార్జిషీటు దాఖలు చేస్తామని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ పేర్కొంది. చార్జిషీటులను సాఫ్ట్‌ కాపీలో అంటే సీడీలో కోర్టుకు సమర్పించింది. చార్జిషీటు దాదాపు 3000 కాపీలు ఉండే అవకావముందని తెలుస్తోంది.

దీంతో వీటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చార్జిషీటు దాఖలు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ట్వీట్ చేశారు. ‘ఈడీ చార్జీషీటులో కూడా మనీష్‌ పేరు లేదు. విద్యకు సంబంధించి మనీష్‌ చేపట్టిన కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించినందుకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలికదా? బాగా పనిచేసేవారిని జైల్లో పడేస్తే… దేశం ముందుకు సాగుతుందా?’ అని అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రశ్నించారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !