UPDATES  

 మహేష్ కి జంటగా పెళ్లి సందD శ్రీలీల

కొంత మంది హీరోయిన్స్ ని చూస్తే అదృష్టానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఆఫర్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడతాయి. దర్శక నిర్మాతలు వాళ్ళ వెనకబడుతుంటారు. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్స్ తో ఆఫర్స్ పట్టేస్తారు. ఈ జనరేషన్స లో సమంత, రష్మిక, కృతి శెట్టి ఈ కేటగిరీకి చెందినవారు. తాజాగా ఈ లిస్ట్ లో శ్రీలీల చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ ని ఏలేసేలా ఉంది. ఆమె కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. Mahesh Babu- Sreeleela శ్రీలీల పెళ్లిసందD మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. అయితే తన గ్లామర్ తో తెలుగు మేకర్స్ ని ఆకర్షించింది. ప్రస్తుతం శ్రీలీల రవితేజకు జంటగా ధమాకా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండానే శ్రీలీలకు భారీ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఏకంగా మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిందట. దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ కి జంటగా శ్రీలీలను ఎంపిక చేశారట. మహేష్ 28 మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కథ రీత్యా సెకండ్ హీరోయిన్ ఉంటుందట.

ఆ ఛాన్స్ త్రివిక్రమ్ శ్రీలీలకు ఇచ్చాడట. శ్రీలీల సూపర్ స్టార్ పక్కన జతకట్టడం దాదాపు ఖాయమే అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అలాగే ఫస్ట్ టైం తన మూవీలో మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం హాట్ బాలీవుడ్ ఫిగర్ ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. Mahesh Babu- Sreeleela ఈ ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. అయితే మరలా స్క్రిప్ట్ లో మార్పులు చేసిన నేపథ్యంలో ఆ షెడ్యూల్ వృద్దా అయినట్లే అన్న వాదన వినిపిస్తోంది. సినిమా రెగ్యులర్ షూట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారట. డిసెంబర్ మొదటి వారంలోనే మహేష్ ఈ ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంచుకున్నారు. ఆయన్ని తప్పిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ శోభన నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.A

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !