మన్యం న్యూస్ చర్ల, నవంబర్ 28: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యురాలు ముగ్గురు మీలీషియా సభ్యులు సోమవారం నాడు ఎస్పీ డాక్టర్ వినీత్ జి సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సమక్షంలో వీరంతా లొంగిపోయారు.లోంగిపోయిన వారిలో మడవి మూయ (20) ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఈమె గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చంద్రన్న దళంలో దళ సభ్యురాలుగా పని చేసింది.రవ్వా దేవా (22) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొరట్క్ పాడు గ్రామానికి చెందిన వాడు.ఇతను గత మూడు సంవత్సరాలుగా చర్ల మీలిషియా సభ్యులుగా కొనసాగుతూ పలు విధ్వంసకర సంఘటనలో పెసరపాడు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు.కొవ్వాసి గంగ (25) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూరుగుపాడు గత సంవత్సరం కాలంగా చర్ల మీలిషియా సభ్యులుగా పని చేస్తున్నాడు.వండో దూరే (20) చర్ల మండలం బూరుగుపాడు ఈమె గత సంవత్సరం కాలంగా చర్ల మీలిషియా సభ్యురాలుగా పని చేస్తుంది. వీరంతా మావోయిస్టు పార్టీ నాయకులు అమాయక గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వారి దుర్మార్గపు చర్యలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని లొంగిపోవడం జరిగింది.ప్రజలలో మావోయిస్టు పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని,మావోయిస్ట్ పార్టీ లో పని చేసే నాయకులు సభ్యులు వారిని వారు రక్షించుకోవడమే కష్టం గా మారిందని ఆయన అన్నారు.పోలీసులను హతమార్చాడానికి అడవి లో పశువులు గిరిజనులు సంచరించే ప్రాంత ల్లో లాండ్ మైన్స్ ఫ్రెషర్ మైన్ వంటి పెలుడు పదార్థాలు అమర్చుతూ ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరించని వారిని ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి కిరాతకంగా వారిని చంపుతున్నారు. కుర్నపల్లి ఉపసర్పంచ్ ఇర్ప రాముడు నీ ఇంటి నుండి తీసుకువెళ్లి చంపడంతో మనస్థాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి చర్యల వల్ల ఆదివాసి పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు నేరుగా నేరుగా తమ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో గాని బంధువుల ద్వారా ఎస్పి వద్దకు స్వచ్ఛందంగా లొంగిపోవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో సి. ఐ అశోక్ ఎస్.ఐ రాజు వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.