UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 మీ పార్టీ నేతలకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

‘మీరు గెలిచింది 151 సీట్లు.. నేనేమో రెండు చోట్లా ఓడిపోయాను. నా మీద పడి ఏడుస్తారెందుకు.?’ అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు తెలిసింది సాయం చేయడం మాత్రమే. సినిమాల్లో సంపాదిస్తున్నాను.. దాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు.? ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మీ పేర్లు పెట్టుకుంటున్నారు. పైగా, అయినవారికి పదవులు కట్టబెట్టుకుంటున్నారు..

కొత్త కొత్త పదవులు ప్రవేశ పట్టి, మీ పార్టీ నేతలకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నారు..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలిప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. సత్తా.. తాకత్.. ‘నేను ఓడిపోయినా నన్ను చూసి 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ భయపడుతోంది. సత్తా.. తాకత్.. అది గుండెల్లో వుంటుంది.. గెలిచే సీట్ల సంఖ్యలో వుండదు..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు. ‘గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని ఎన్నికల సమయంలో చెప్పాను.. అదే మాటకు కట్టుబడి వున్నాను. సినిమాలు నేను చెయ్యాలి.. ఎందుకంటే, మీలా దోచుకున్న సొమ్ములేవీ నా దగ్గర లేవు…’ అంటూ జనసేనాని పంచ్ డైలాగులు పేల్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !