UPDATES  

 మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ లభించేనా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కారుకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించినట్లయ్యింది. అయితే, రాజధానిలో నిర్మాణాల్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం ద్వారానే ఈ ఊరట లభించింది. రాజధానిని ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమనీ, అలా ఆదేశించడానికి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.? హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే, క్యాబినెట్ ఎందుకు.? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.

మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ లభించేనా.? అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనల్ని తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు వైసీపీ సర్కారుకి ఊరటనిస్తుందా.? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కేసు తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు , ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, స్టే విధింపు అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !