UPDATES  

 విభిన్న నూనెల్లో ఉండే విభిన్న ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లను మన శరీరానికి మేలు

వంట నూనెకు డయాబెటిస్‌కు సంబంధం ఉందా? డయాబెటిస్ మేనేజ్మెంట్‌లో కార్బొహైడ్రేట్లపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అయితే సమతుల ఆహారంలో మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయంలో ఫ్యాట్. అవయవాలకు కుషన్‌లా, శక్తిని నిల్వ చేసేదిగా, విభిన్న మూలకాల నుంచి రక్షణ ఇచ్చేదిగా కొవ్వు పనిచేస్తుంది. అలాగే కణాల పెరుగుదలకు చేయూత ఇచ్చేదిగా, కణాలు త్వరగా మృతిచెందకుండా నిరోధించేదిగా పనిచేస్తుంది. మరి మనం తినే ఆహారంలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటే అది డయాబెటిస్‌కు దారితీస్తుందా? ఫ్రై చేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని ఫ్రై చేస్తున్నట్టే బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మహేష్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయా అంశాలపై మాట్లాడారు. ‘మన శరీరానికి కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ అవసరం. ఏ ఫ్యాట్ అయినా అనారోగ్యానికి కారణమవుతుందని చెప్పడానికి లేదు. విభిన్న నూనెల్లో ఉండే విభిన్న ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లను మన శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల మూడు నెలలకోసారి వంట నూనెను మార్చాలి. మరో వైపు ట్రాన్స్‌ఫ్యాట్ అనేది శాచ్యురేటెడ్ ఫ్యాట్. ఇది డయాబెటిస్ రిస్క్‌ను 7 శాతం అధికం చేస్తుంది. ఫ్రై చేసే ప్రాసెస్‌లో వంట నూనె డీగ్రేడ్ అవతూ వస్తుంది. అంటే ఒకరకమైన రసాయనిక ప్రక్రియ జరిగి వంట నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ స్వరూపాన్ని మార్చేస్తాయి. అలా బాగా మరిగిన, చెడిపోయిన నూనెలో ఉడికే ఆహార పదార్థాలు ఈ మారిన ఫ్యాటీయాసిడ్స్‌ను, హానికర పదార్థాలను గ్రహిస్తాయి..’ అని వివరించారు. ‘యాసిడ్స్, ఇతర సమ్మేళనాలు నడుము చుట్టుకొలతనే మార్చేస్తాయి. అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బ్లడ్ ప్రెజర్‌ను పెంచుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్‌ను అధికం చేస్తాయి.

ఇవన్నీ డయాబెటిస్‌, గుండెజబ్బుల రిస్క్‌ను, ఫ్రైడ్ ఫుడ్ వినియోగానికి మధ్య ఉన్న లింక్‌ను తెలియపరుస్తున్నాయి. అంటే ఫ్రైడ్ ఫుడ్ తినేవారిలో 39 శాతం నుంచి 50 శాతం అధిక రిస్క్ ఉంది. ఉదాహరణకు వారానికి నాలుగు నుంచి ఆరు సార్లు ఫ్రైడ్ ఫుడ్ తినే వ్యక్తి డయాబెటిస్ డెవలప్అయ్యే రిస్క్ 39 శాతం ఎక్కువగా ఉంటుంది. వారానికి ఏడుసార్ల కంటే ఎక్కువగా తింటే ఆ రిస్క్ 50 శాతం ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్‌లో క్యాలరీలు రెండింతలు ఉంటాయి. ప్రాసెస్‌డ్ ఫుడ్ అధిక శాచ్యురేటెడ్ ఫ్యాట్, అధిక కార్బొహైడ్రేట్లు కలిగిన డెడ్లీ కాంబినేషన్. ఈ రెండూ అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి..’ అని హెచ్చరించారు. బీజీఎస్ గ్లెనీగల్స్‌ గ్లోబల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజీ, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ అశ్వథయ్య దీనిపై మాట్లాడారు. కొవ్వుల్లో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్ల వాటిని తీసుకునే పరిమాణంపై మనకు అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. ‘సరైన కొవ్వులు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్‌, కొన్ని రకాల క్యాన్సర్లు, ఇతర సమస్యల రిస్క్ తగ్గుతుంది. అందువల్ల కొవ్వుల్లో రకాలు మనం తెలుసుకోవాలి..’ అని వివరించారు. కొవ్వులు నాలుగు రకాలు కొవ్వుల్లో నాలుగు రకాల కొవ్వులు ఉంటాయని డాక్టర్ శ్రీనాథ్ వివరించారు. ‘శాచ్యురేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్, మోనోఅన్‌శాచ్యురేటెడ్, పాలీఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ అనేవి ప్రధానమైన కొవ్వులు. శాచ్యురేటెడ్, ట్రాన్స్‌ ఫ్యాట్స్ కంటే మీ ఆహారంలో మోనోఅన్‌శాచ్యురేటెడ్, పాలీఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులను చేర్చుకోవాలని అనేక హెల్త్ సొసైటీలు, పోషకాహార సంస్థలు సిఫారసు చేస్తున్నాయి..’ అని చెప్పారు. ‘ప్రతి ఒక్క నూనె విభిన్న ఆరోగ్యకర ఫ్యాటీ యాసిడ్స్‌ను మన శరీరానికి అందిస్తాయి. .’ అని వివరించారు. వంట నూనె ఏది వాడాలి? ‘వర్జిన్ ఆయిల్‌ను మనం పచ్చిగానే తీసుకోవాలి. సలాడ్స్, రైస్ మిక్చర్స్‌పై వర్జిన్ ఆయిల్‌ను పచ్చి నూనెగానే తీసుకోవాలి. వేడి చేయకూడదు. వర్జిన్ ఆయిల్ టైరోసోల్ అనే యాంటీఆక్సిడాంట్లను కలిగి ఉంటుంది. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ పరిస్థితిని మెరుగుపరిచి డయాబెటిస్ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఊబకాయం రిస్క్‌ను కూడా తగ్గిస్తాయి. నువ్వుల నూనె చర్మానికి, వెంట్రుకలకు మేలు చేస్తుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఈ, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులో పెడుతుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లకు నువ్వుల నూనె కూడా మంచిది. రైస్ బ్రాన్ ఆయిల్ డయాబెటిక్ పేషెంట్లకు ప్రయోజనకారి. నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి వాడితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి..’ అని డాక్టర్ వివరించారు. వేరుశనగ (పల్లి) నూనె మంచిదేనా? పాలీఅన్‌శాచ్యురేటెడ్, మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే వేరుశనగ (పల్లి) నూనె డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. దీనిలో విటమిన్ ఈ కూడా ఉంటుంది. కొబ్బరి నూనె చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మానికి, శిరోజాలకు, సమగ్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. బరువును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను అదుపులో పెట్టేందుకు అవసరమైన మంచి శాచ్యురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది..’ అని వివరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !