UPDATES  

 RUSSIA లో రిలీజ్‌కు సిద్ధమైన పుష్ప: ది రైజ్‌..

పుష్ప: ది రైజ్‌ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం ఓ సంచలనం సృష్టించింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే కూలీగా పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించిన అల్లు అర్జున్.. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తెలుగుతో సమానంగా హిందీలోనూ ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ మూవీ సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా ఇండియా దాటి రష్యాలో అడుగు పెట్టబోతోంది. డిసెంబర్‌ 1 నుంచి ఆ దేశంలో ప్రీమియర్స్‌ మొదలు కానున్నాయి. ఇక డిసెంబర్‌ 8న రష్యా వ్యాప్తంగా పుష్ప రిలీజ్‌ అవనుంది. ఈ మూవీలోని తగ్గేదేలే డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలుసు కదా. ఆ డైలాగ్‌లాగే పుష్ప మూవీ కూడా అసలు తగ్గడం లేదు. ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు అవార్డుల పంట పండించింది.

ఇప్పుడిక రష్యాలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్‌లో మన దగ్గర ఈ సినిమా రిలీజై సంచలనం సృష్టించగా.. ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత రష్యాలో అడుగుపెట్టబోతోంది. డిసెంబర్‌ 1న రష్యా రాజధాని మాస్కోలో ప్రీమియర్స్‌ ఉండనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్‌ పీటర్స్‌బర్గ్‌లోనూ మరో ప్రీమియర్‌ షో ఉంటుంది. వీటికి పుష్ప సినిమా నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరు కానుండటం విశేషం. ఇక ఈ మూవీ డిసెంబర్‌ 8న అక్కడ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ తన గత సినిమాలతోనే కేరళతోపాటు నార్త్‌లోనూ ఎంతో క్రేజ్‌ సంపాదించాడు. ఇక పుష్ప మూవీతో అతని రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. పుష్ప 2 కోసం అతడు ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్‌ అందుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !