వై యస్ షర్మిల పై తెరాస నాయకుల దాడిని ఖండించండి
వైయస్సార్ టిపి అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 28: వైయస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో అశేష జానవాహిని మధ్య నిర్వీరామంగా జరుగుచున్నందున చూసి ఓర్వలేక నర్సంపేట లో షర్మిల వాహనంపై పెట్రోల్ దాడి చేసి నిప్పంటించడం చాలా హేయమైన చర్య అని, దీనిని వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయని ఈ ప్రభుత్వం, ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైస్సార్ టీపీ అధ్యక్షురాలిని ప్రత్యక్షంగా ఎదుర్కొలేక భయపడి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడ్డారని, ఇలాంటి వాటికీ భయపడే పార్టీ కాదని, రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని సహించేది లేదని వైయస్సార్ టిపి అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు అన్నారు. ఈకార్యక్రమంలో పాకనాటి శ్రీను, రెడ్డిమల్ల రాజు, శ్రీరాముల వెంకటేశ్వరరావు, షేక్ ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు.