మన్యం న్యూస్, అశ్వారావుపేట నవంబర్ 28: పౌర హక్కుల సంఘం ( సి ఎల్ సి) ఉమ్మడి ఖమ్మం జిల్లా 17వ మహాసభలు డిసెంబర్ 4వ తేదీన సత్తుపల్లి కళాభారతి ప్రాంగణంలో జరుగుతాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు ఉదయరాఘవేంద్ర పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా ముద్రించిన గోడ పోస్టర్, కరపత్రాలను అశ్వారావుపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి, విప్లవ కుమార్, ప్రారంభ ఉపన్యాసకులు సీనియర్ న్యాయవాది కొండపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు.