UPDATES  

 ‘అన్నదాత’ మూతపడింది..

చతుర, విపుల, సితార, అన్నదాత… కేవలం ఈనాడు మాత్రమే కాకుండా ఇవన్నీ రామోజీ కాంపౌండ్ నుంచి పబ్లిష్ అయ్యేవి. అప్పట్లో ఇవన్నీ కూడా ఒక వెలుగు వెలుగుతూ ఉండేవి. రోజులన్నీ రామోజీరావువి కావు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతూ ఉన్నాయి. కోవిడ్ కి ముందే చతుర, విపుల, సితారను మూసేశారు. ఆ తర్వాత ఇప్పుడు అన్నదాతపై వేటు వేశారు. లక్షల్లో సర్క్యూ లేషన్ అన్నదాత అంటే తెలుగు నాట తెలియని రైతులు లేరంటే అతిశయోక్తి కాదు. కొన్ని లక్షల కాపీల సర్క్యులేషన్ ఉన్న మాస పత్రికగా అది పేరు గడించింది. ఈనాడు అనే బ్రాండ్ వాడుకొని అన్నదాతను ప్రమోట్ చేసేవారు. అప్పట్లో చంద్రబాబు సాకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంచికలు కొని రైతు సంఘాలకు అందజేసేది.. ఒక జిల్లాలో ఉండే అన్ని రైతు సంఘాలకు కలిపి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అన్నదాతకు ఒక చెక్కు రూపంలో చందా చెల్లించేవారు. జిల్లాలో ఉండే వేల సంఘాలకు ఈనాడు యాజమాన్యం అన్నదాత సంచికను పోస్టులో పంపేది. అంతేకాదు జిల్లా కార్యాలయాల్లో ప్రతినెలా వందల అన్నదాత పుస్తకాలు ములుగుతూ ఉండేవి. అప్పట్లో కొందరు రైతులు చందా కట్టి పుస్తకాలు తెప్పించుకుంటే, మరికొందరికి ఉచితంగా పుస్తకాలు వచ్చేవి. ఇలా ఎందుకు వస్తున్నాయో వారికి అర్థం కాకపోయేది. పడిపోయింది ఈనాడు అన్నది ఒక బ్రాండ్ కాబట్టి.. ప్రభుత్వాలు మారిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వమే వ్యవసాయ శాఖ తరపున సొంతంగా ఓ పత్రిక నడుపుతోంది.. నిత్యం పాత పత్రికలో ఉండే సమాచారాన్ని మళ్లీ ముద్రించడం రైతులకు పంచిపెట్టడం అలవాటు చేసుకున్న అన్నదాతకు.. కొత్తతరం వ్యవసాయ జర్నలిజం తో పోటీ పడటం చేతకాలేదు.

దానికి తగ్గట్టుగా మార్కెట్ పడిపోయింది.. ప్రభుత్వం ద్వారా చందాలు కట్టించుకుని దందా సాగించాలంటే ఇప్పుడు ఏపీలో నడిచే యవ్వారం కాదు. ఆదాయం లేనప్పుడు రామోజీరావు ఎలాంటి వ్యాపారాన్నయినా తృణప్రాయంగా వదిలించుకుంటారని అందరికీ తెలుసు. ఇది మరోసారి అన్నదాత మూసివేతతో నిరుపితమైంది. ఇదే కాదు తెలుగు భాషకు సేవ చేసేందుకు అనే ముసుగులో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురిస్తూ వచ్చిన తెలుగు వెలుగు పత్రికను మూసివేశారు. బాల భారతీ ది కూడా ఇదే పరిస్థితి. తెలుగు వెలుగు ద్వారా యాడ్స్ రాకపోయేసరికి మూసి వేశారని చాలా మంది అంటూ ఉంటారు. అన్నదాత మూత తో రామోజీరావు మరో ఆర్థిక స్తంభం కూలిపోయినట్టే. హరికృష్ణ నోట్ తో.. అన్నదాత కు ఎడిటర్ గా రామోజీరావు బంధువు అమీర్నేని హరికృష్ణ వ్యవహరిస్తున్నారు.. ఇవాళ ఆయన ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసి ఇకనుంచి అన్నదాత మ్యాగజిన్ రాదని ప్రకటించారు. దీనిని మూసి వేశారని పాఠకులకు అర్థమైంది. అయితే ఇటీవల వ్యవసాయ జర్నలిజంలో కొత్త పుంతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రైతు నేస్తం రైతులకు బాగా చేరువైంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం కాబట్టి… రైతులు కూడా యూట్యూబ్ లో వీడియోలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అదే టెక్నాలజీ పరంగా అప్డేట్ కానీ అన్నదాత.. యాడ్స్ రూపంలో నగదును ఆర్జించడంలో విఫలమైంది. దీంతో అన్నదాతను మూసివేసేందుకే రామోజీరావు మొగ్గు చూపారు. పచ్చళ్ళు, పేపర్ అనే కాంబినేషన్లో మార్కెట్లోకి వచ్చిన రామోజీరావుకు.. ఇప్పుడు ప్రియా పచ్చళ్ళు, ఈనాడు మాత్రమే మిగిలాయి..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !